తమిళనాడులో RSS కవాతుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

తమిళనాడు రాష్ట్రంలో RSS కవాతుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకుగాను మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, మహాత్మాగాంధీ జయంతి ( అక్టోబర్ 2, 2022 ) న కవాతు నిర్వహించడానికి ఆర్ఎస్ఎస్ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఆర్ఎస్ఎస్ అభ్యర్థనను తిరస్కరించింది స్టాలిన్ సర్కార్. మద్రాస్ హైకోర్టును ఆర్ఎస్ఎస్ ఆశ్రయించింది. ఫిబ్రవరి 10, 2023న మద్రాస్ హైకోర్టు డివిజన్ బేంచ్, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్మ వాతావరణంలో ప్రతీ ఒక్కరు తమ హక్కులను పొందే అవసరం ఉందని తెలుపడంతోపాటు.... మార్చ్ ను నిర్వహించుకునేందుకు అనుమతించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది స్టాలిన్ ప్రభుత్వం.
సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్టాలిన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్ఎస్ఎస్ తన ఖవాతును నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఆర్ఎస్ఎస్ మార్చ్ వలన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వాదించగా.. సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆర్ఎస్ఎస్ కవాతుకు లైన్ క్లియర్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com