గ్రేట్.. 100 ఏళ్ల జంట.. ఏడూ రోజుల్లోనే కరోనాను జయించారు. !

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ మొదలగు రాష్ట్రాలలో భారీగా కరోనా కేసులు వస్తున్నాయి. అయితే కరోనా వచ్చిందటే చాలా మంది భయపడుతున్నారు. అలా భయపడుతున్న చాలా మంది పై ఫోటోలో ఉన్న వృద్ద జంట సరికొత్త ఆశాకిరణంగా కనిపిస్తుంది.
మహారాష్ట్రకి చెందిన ధేను ఉమాజీ చవాన్(105), ఆయన సతిమణి మోతాబాయి చవాన్ (95), ఈ వయసులో ఎంతో దైర్యంతో కరోనాను జయించారు. వీరిద్దరూ కలిసి కేవలం ఏడూ రోజుల్లోనే కరోనాను జయించడం విశేషం.. కరోనా వచ్చిందనగానే చాలా మందిలో ఎక్కడ టెన్షన్ మొదలవుతుంది. కానీ దైర్యం ఉంటే కరోనానే కాదు దేన్నైనా జయించవచ్చునని నిరూపించింది ఈ వృద్ద జంట.
ఎలాంటి టెన్షన్ పడకుండా వెంటిలేటర్ పై నుంచి లేచి నవ్వుతూ ఇంటికి వచ్చేశారు. ముందుగా తన తల్లిదండ్రులుకి కరోనా సోకిందని తెలియగానే గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చానని.. అయితే వారి వయసు దృష్ట్యా కరోనా నుంచి కోలుకోవడం కష్టమేనని అనిపించిదని కానీ వారు కరోనాను జయించడం అనదంగా ఉందని ఆ వృద్ద దంపతుల కుమారుడు సురేష్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com