కర్నాటకలో ఒక్కరోజే 122మంది కరోనాతో మృతి

కర్నాటకలో ఒక్కరోజే 122మంది కరోనాతో మృతి
గత నెలరోజులుగా కర్నాటకలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది. ఒకానొక సమయంలో ప్రతీరోజూ 10 వేల కేసులు నమోదవుతూ వచ్చాయి.

గత నెలరోజులుగా కర్నాటకలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది. ఒకానొక సమయంలో ప్రతీరోజూ 10 వేల కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇటీవల కాస్తా తగ్గుముఖం పట్టి ఏడు వేల వరకూ కేసులు నమోదవుతున్నప్పటికీ.. కరోనా మరణాలు మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 122 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,26,876కు, మరణాల సంఖ్య 8,145కు చేరింది. ఇప్పటివరకూ 4,23,377 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 95,335 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story