chennai women excorcism భార్యకి ఆమె స్నేహితురాలితో పెళ్లి చేసిన భర్త.. పిల్లలిద్దరనీ చంపేందుకు భారీ స్కెచ్

chennai women excorcism  భార్యకి ఆమె స్నేహితురాలితో పెళ్లి చేసిన భర్త.. పిల్లలిద్దరనీ చంపేందుకు భారీ స్కెచ్
పెళ్లైన ఓ మహిళ స్నేహితురాల్ని పెళ్లిచేసుకుంది. అది కూడా భర్త అంగీకారంతో.

పెళ్లైన ఓ మహిళ స్నేహితురాల్ని పెళ్లిచేసుకుంది. అది కూడా భర్త అంగీకారంతో. ఇక్కడితో కథ అయిపోలేదు. అతీంద్రియ శక్తుల సాధన కోసం తన ఇద్దరు పిల్లల్ని బలిపెట్టాలని చూసింది. భర్తతో కలిసి వాళ్లను చంపేందుకూ సిద్ధమైంది. ఆఖరు నిమిషంలో ఆ చిన్నారుల అదృష్టం బావుండి.. వాళ్లు అక్కడి నుంచి తప్పించుకోవడంతో ఈ ప్లాన్ అంతా బయటపడింది. ఈ ఘటన తమిళనాడులో పెను సంచలనంగా మారింది.

ఈరోడ్‌ జిల్లా రంగంపాళ్యంకు చెందిన రామలింగం, రంజితలకు ఇద్దలు పిల్లలు. పెద్దకుమారుడు దీపక్‌కి 15 ఏళ్లు‌. చిన్నోడు కిషాంత్‌కి 6 ఏళ్లు. వీళ్లిద్దరినీ క్షుద్రపూజలు, మూఢనమ్మకాల కారణంగా బలిచ్చేందుకు భార్యాభర్తలు పథకం వేశారు. ఇందులో మూడో మనిషి ప్రమేయం కూడా ఉంది.

ఆమే ధనలక్ష్మి. వీళ్ల జీవితాల్లోకి ఆ ధనలక్ష్మి ఎంట్రీతోనే ఈ తరహా పిచ్చి మొదలైంది. రామలింగానికి ఇద్దరు భార్యలు. రంజిత మొదటి భార్య కాగా ఇందుమతి అనే మరో మహిళను కూడా పెళ్లిచేసుకున్నాడు. అదే కాలనీలో వేర్వేరు కాపురాలు పెట్టాడు. ఈ ఇద్దరు భార్యలకు కామన్ ఫ్రెండ్ అయిన ధనలక్ష్మి.

మొదటి భార్య రంజిత ఇంటికి రావడంతో ఈ అతీంద్రియ శక్తుల ఆలోచన వెర్రితలలు వేసింది. మొదట్లో రంజిత, ధనలక్ష్మి స్నేహితులుగా బాగానే ఉన్నా.. తర్వాత ఈ విపరీత మనస్థత్వం బయటపడింది. దీన్ని మొదట్లోనే తుంచేయాల్సిన రామలింగం కూడా సమర్థించాడు.

ఇద్దరు శివపార్వతుల్లా ఉన్నారంటూ పొగడ్తలు కురిపించేవాడు. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకుంటాను అంటే ఓకే అన్నాడు. తానే దగ్గరుండి ఇంట్లోనే పిల్లల సమక్షంలోనే పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత నుంచి క్షుద్రారాజకీయం మలుపులు తిరిగింది..

రంజిత, ధనలక్ష్మి పెళ్లి చేసుకున్నాక వాళ్లను ఈ ఇద్దరు పిల్లలు ఏమని పిలవాలి.. అక్కడి నుంచి కొత్త నాటకం మొదలైంది. ఇకపై దీపక్‌, కిషాంత్‌కి తాను తండ్రిని కాదని.. ధనలక్ష్మిని నాన్న అని పిలవాలని చెప్పడం మొదలెట్టారు. కన్నతండ్రి రామలింగం కాస్తా ఇప్పుడు మావయ్యలా పిలిపించుకోవడం మొదలెట్టాడు.

కరోనా కారణంగా స్కూళ్లు కూడా లేకపోవడంతో ఇంట్లోనే ఉన్న ఈ పిల్లలు తాము పడుతున్న కష్టాల్ని ఎవరికీ చెప్పుకునే వీలు లేకుండా పోయింది. ఈ నరకం నుంచి ఎలాగైనా బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ ఇద్దరు పిల్లలకు ఇంతలో షాకింగ్ విషయం తెలిసింది.

తొందర్లోనే వాళ్లను బలి ఇస్తారని అర్థమై.. ఎలాగోలా తప్పించుకుని ఇంట్లోంచి పారిపోయారు. తాతయ్య ఇంటికి చేరుకుని జరిగింది చెప్పారు. దీంతో.. ఆ పెద్దాయన పిల్లల్ని తీసుకుని ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ తాంత్రిక ఆటకు ఫుల్‌స్టాప్ పడింది. ప్రస్తుతం రంజిత, ధనలక్ష్మి, రామలింగం ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కొద్ది నెలల కిందట చిత్తూరు జిల్లా మదనపల్లెలో డబుల్ మర్డర్ కేసు సంచలనం రేపింది. తల్లిదండ్రులే తమ పిల్లల్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఉన్నత విద్యావంతులైనా సరే ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిన పద్మజ, పురుషోత్తంలు.. తమ పిల్లలు అలేఖ్య, సాయి దివ్యలను చంపేశారు.

తానే శివుడిని అంటూ పద్మజ పిచ్చిపట్టినట్టు మాట్లాడడం కూడా మనం చూశాం. ఇప్పుడు తమిళనాడులోని ఈ కేసులో కూడా ఈ మహిళలు ఇలాగే ప్రవర్తించారు. లక్కీగా ఇంట్లోంచి పారిపోయి ఇద్దరు పిల్లలు ప్రాణాలు దక్కించుకోవడంతో ఈ కథ సుఖంతమైనా.. వీళ్ల మెదడులోకి ఈ అతీంద్రియ శక్తుల పురుగు ఎలా దూరిందో తేల్చేందుకు ఈరోడ్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story