వరుసగా ఐదో రోజు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

వరుసగా ఐదో రోజు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
వరుసగా ఐదో రోజు దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2 లక్షల 73 వేల 810 కేసులు.. 1619 మంది మృతి చెందారు.

వరుసగా ఐదో రోజు దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2 లక్షల 73 వేల 810 కేసులు.. 1619 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య కోటి50లక్షల 61వేల 919కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య లక్షా 78వేల 769కి చేరాయి. ఇక దేశంలో ప్రస్తుతం 19లక్షల29వేల329 యాక్టివ్ కేసులు ఉండగా.. కోటి 29లక్షల 53వేల 821 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో లక్షా 44వేల 178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 68,631 కేసులు.. 500 మంది మృతులు నమోదయ్యూయి. యూపీ, ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లోనూ వేలల్లో కేసులతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అమెరికా తర్వాత ఆ స్థాయిలో వైరస్ విలయం భారత్‌లోనే నమోదవుతోంది.

Tags

Next Story