దేశంలో కొత్తగా 3,79,257 కరోనా కేసులు.. 3,645 మంది మృతి..!

దేశంలో కొత్తగా 3,79,257 కరోనా కేసులు.. 3,645 మంది మృతి..!
నిమిషానికి 263 మంది, గంటకు 15వేల 800 మంది, 24 గంటల్లో 3 లక్షల 79వేల 257 మంది. ఇదీ దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయం.

నిమిషానికి 263 మంది, గంటకు 15వేల 800 మంది, 24 గంటల్లో 3 లక్షల 79వేల 257 మంది. ఇదీ దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయం. రేపో, ఎల్లుండో రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదు. నిపుణులు హెచ్చరించినట్టుగా మే నెలలో మారణహోమమే జరిగేట్టుగా కనిపిస్తోంది. మే నెల మొదటి వారం ముగిసేలోపు దేశంలో రోజుకు కనీసం 5 లక్షల మందికి చొప్పున కరోనా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు ఒక కోటి 83 లక్షల 76 వేల 524మందికి కరోనా సోకింది.

నెలన్నరగా అదుపు అన్నదే లేకుండా పంజా విసురుతున్న కరోనా.. మరణాల సంఖ్యనూ అంతకంతకూ పెంచుతోంది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 3వేల 645 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2 లక్షల 4వేల 832కు చేరింది. దేశంలో ఇప్పటికీ 30 లక్షల 84వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 15 కోట్ల 20వేల మందికి పైగా కరోనా వ్యాక్సిన్లు వేశారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న మొన్న 45వేల రేంజ్‌లో ఉంటే.. ఇప్పుడు 63వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నాటకలోనూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్‌డౌన్‌ విధించినప్పటికీ.. కరోనా కల్లోలం మాత్రం ఆగడం లేదు. కర్నాటకలో నిన్న 39వేల కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ప్లేసులో కేరళ ఉంది. కేరళలో గడిచిన 24 గంటల్లోనే 35వేల మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఉత్తరప్రదేశ్‌లోనే పరిస్థితి దారుణంగా ఉంది. నిన్న 28వేల మందికి కరోనా సోకింది. ఢిల్లీలో 26వేల కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story