దేశంలో కొత్తగా 3,82,315 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో చెలరేగిపోతోంది. ప్రతి రోజూ 3 లక్షలకు పైగా కేసులు వెలుగుచూస్తుండగా, వేలాదిమంది దాని కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నారు. నిన్న ఒక్క రోజే 3లక్షల 82వేల 315 కేసులు నమోదయ్యాయి. 3వేల 780 మంది మరణించారు. ప్రస్తుతం 34లక్షల 87వేల 229 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు.. పలు ఆసుపత్రులలో మౌలిక సదుపాయలు, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది.
ఫలితంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరణాలను, వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేకపోతోంది. భారత్‌లో ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగానే.. కరోనా బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రాలు కఠిన ఆంక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా మే 15 వరకూ బీహార్‌లో లాక్‌డౌన్ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com