India corona cases : స్వల్పంగా తగ్గిన కేసులు, మరణాలు..!

X
India corona cases : భారత్‌లో కరోనా కేసులు 40వేల దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,667 మందికి కరోనా సోకింది. కొన్ని రోజులుగా భారత్‌లో 40వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 478 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.45 శాతం ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 కోట్ల 61 లక్షల డోసుల టీకా పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
