బంపరాఫర్.. 5 పైసలకే బిర్యానీ.. జనం క్యూ..ఇంతలోనే ట్విస్ట్..!

5 Paise Biryani Offer in Tamilnadu
X

Biryani

Biryani Offer: కొత్తగా ఎదైనా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లు ఇవ్వడం సహజం.

Biryani Offer: కొత్తగా ఎదైనా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లు ఇవ్వడం సహజం. షాపుల యాజమానులు తమ హోటల్ గురించి అందిరికి తెలిసేలా అదిరిపోయే ఆఫర్లు ఇస్తుంటారు. ఇలానే ఐదు పైసలకే బిర్యానీ అంటూ ఆఫర్ ఇచ్చాడు తమిళనాడులోని బిర్యానీ సెంటర్ ఓనర్. దీంతో ప్రజలు ఆ స్టాల్‌ ముందు క్యూ కట్టారు. కరోనా రూల్స్ ఏ మాత్రం ఖాతరు చేయకుండా బిర్యానీ కోసం ఎగబడ్డారు.

తమిళనాడులోని మదురైకి చెందిన ఓ వ్యక్తి కొత్తగా బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించారు. దాని ప్రమోషన్‌లో భాగంగా.. ఎవరైతే 5 పైసల నాణెం తీసుకొస్తారో వారికి మాత్రమే తమ బిర్యానీ ఉచితంగా అందిస్తామని తెలిపాడు. బిర్యానీ సెంటర్ ఓనర్ పెట్టిన కండీషన్ కి జనం నుంచి స్పందన రాదని భావించారు. అయితే ఈ ప్రకటనకు ఊహించని స్పందన లభించింది.

దాదాపు 300మందిపైగా 5 పైసల నాణేలాతో అతని బిర్యానీ సెంటర్‌ ముందు వాలిపోయారు. అందులో యువతే ఎక్కువ మంది ఉన్నారు. వారిలో చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించలేదు. చాలా మంది మాస్క్‌లు ధరించలేదు. సోషల్ డిస్టెన్స్‌ని గాలికి ఒదిలేశారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ బిర్యానీ కోసం ఎగబడ్డారు.

ప్రజలు గుమిగూడటంపై పోలీసులకు సమాచారం వెళ్లింది. ఇంకేం.. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అక్కడికి చేరుకొని గుమిగూడిన వారిని చెదరగొట్టారు. ఈ ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆ షాపు యజమాని బిర్యానీ సెంటర్ మూసేసి వెళ్ళిపోయాడు. షాపు మూసేసిన సంగతి తెలియని చాలా మంది ఇంకా అక్కడకు చేరుకుంటున్నారు. ఐదు పైసలు ఇస్తే బిర్యానీ ఇస్తామన్నారని.. ఇల్లంతా సోదా చేసి మరీ 5 పైసలు తెస్తే దుకాణం మూసేశారని కొందరు వాపోయారు.

Tags

Next Story