భారత్‌లో కొత్తగా 69,921 కరోనా కేసులు

X
భారత్‌లో కరోనా కోరలు చాస్తూనే ఉంది. గత 24 గంటల్లో భారత్‌లో 69,921 కేసులు నమోదు కాగా, 819 మంది ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో కేసుల సంఖ్య మొత్తం 36,91,173 కు చేరుకుంది. అలాగే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 65,081 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,85,996 ఉండగా, 28,39,882 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 65,288 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.94 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.77 శాతానికి తగ్గింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
