Tadoba Andhari Tiger Reserve: పులుల సర్వే కోసం వెళ్లిన లేడీ ఫారెస్ట్ ఆఫీసర్.. పులి పంజాకే..

Tadoba Andhari Tiger Reserve: ఫారెస్ట్ ఆఫీసర్లు నిరంతరం ఎన్నో ఇబ్బందుల మధ్య విధులు నిర్వహిస్తుంటారు. ఏ పక్క నుండి ఏ ఆపద వస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి పర్యావరణాన్ని, జంతువులను పరిరక్షించే క్రమంలో వారే వాటికి బలవుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ ఘటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది.
శనివారం ఉదయం స్వాతి డుమేన్ అనే ఒక సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్.. ఏ సర్వే కోసం రిజర్వ్‌లోని కొలారా ప్రాంతానికి వెళ్లారు. ఆమెతో పాటు ఇద్దరు ఆఫీసర్లు కూడా ఉన్నారు. అయితే వారి కదలికలను గమనించిన ఓ పులి డుమేన్‌ను దాడి చేసింది. ఆఫీసర్లు కాస్త ముందు ఉండడంతో వారు తప్పించుకున్నారు. స్వాతి డుమేన్‌పై దాడి చేసిన ఆ పులి తనను అడవిలోకి లాక్కెళ్లిన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫీసర్ డాక్టర్ జితేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 సర్వే నిర్వహించడానికి స్వాతి డుమేన్.. ఇద్దరు ఆఫీసర్లతో కలిసి అడవిలోకి వెళ్లారు. రిజర్వ్‌లోని కొలారా ప్రాంతానికి చేరుకోగానే వారికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఓ పులి కూర్చొని ఉండడం వారు గమనించారు. అరగంట వరకు ఏ కదలిక లేకుండా అక్కడే ఉన్న తర్వాత వారు దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాతే ఈ దాడి జరిగిందని ఆయన అన్నారు.
స్వాతి డుమేన్‌తో ఉన్న ఆఫీసర్లు ఈ విషయాన్ని సీనియర్ ఆఫీసర్లకు తెలియజేశారు. వారంతా స్వాతిపై దాడి జరిగిన చోటికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని చీమూర్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కొంతకాలం వరకు సర్వే నిలిపివేయాలని, తాను చెప్పేవరకు రిజర్వ్‌లోకి ఎవరూ నడుస్తూ వెళ్లకూడదని జితేంద్ర ఆదేశాలు జారీ చేశారు.
Today a woman Forest Guard Swati Dumane lost his life during a tiger attack. She was working in Tadoba Andheri Tiger Reserve.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 20, 2021
Gave his life while on duty. To the #GreenSoldier 🙏🏼🙏🏼
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com