అవకాశం ఉంటే అంతం చేసేస్తా: పాయల్ రాజ్ పుత్ కన్నీటి పర్యంతం

అయిన వాళ్లందర్నీ దూరం చేస్తోంది. కనీసం ఆఖరి చూపులకు కూడా నోచుకోనివ్వకుండా చేస్తుంది. మాయదారి మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్ని పెంచుతుందనుకుంటే ఉన్న బంధాలని కూడా దూరం చేస్తోంది.
అమ్మలా ఆదరించే అమ్మ, ప్రేమగా పలకరించే ఆంటీ కరోనా కాటుకు బలయ్యారంటూ 'ఆర్ ఎక్స్ 100' భామ పాయల్ రాజ్ పుత్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అనితా ఆంటీని కరోనా కాటేసింది.
ఇకపై మీరు మాతో లేకపోయినా మా హృదయంలో ఎప్పటికీ ఉంటారు అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు పాయల్. మిమ్మల్ని మళ్లీ వెనక్కి తీసుకురావాలని ఉంది కానీ ఆ అవకాశం లేదు కదా అంటూ అనితా ఆంటీ చివరిగా చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. 'నాకు ఊపిరి ఆడ్డం లేదు. అవకాశం ఉంటే కరోనాను అంతం చేసేస్తా' అని పాయల్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com