కాసేపట్లో అప్ఘనిస్తాన్ పరిణామాలపై కేంద్ర అఖిలపక్ష సమావేశం..!

ఆఫ్గానిస్తాన్ పరిణామాలపై చర్చిచేందుకు కాసేపట్లో అఖిలపక్షనేతలు సమావేశమవుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. పార్లమెంట్ హౌస్, మెయిన్ కమిటీ రూమ్‌లో అఖిలపక్ష నేతలు భేటీ అవుతారు. ఆఫ్గానిస్తాన్ పరిణామాలు, భారతీయుల తరలింపుతో పాటు ప్రభుత్వ వైఖరిని అఖిలపక్ష నేతలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటికే ఆఫ్గాన్ బాధితులను తీసుకొచ్చేందుకు ఆపరేషన్ దేవిశక్తి పేరుతో తరలింపు మొదలుపెట్టింది భారత్. ఇప్పటివరకు ఆఫ్గాన్ నుంచి సుమారు 700 మందిని భారత్‌కు తీసుకొచ్చారు. ఆఫ్గాన్‌లో చిక్కుకుపోయిన వారి కోసం, పాత వీసాలు రద్దు చేసి.. ఈ- వీసా విధానాన్ని తీసుకువచ్చింది. మరోవైపు ఆఫ్గాన్‌లో పరిణామాలపై పలు దేశాల ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ.
అఖిలపక్షంలో కేంద్రానికి చేయాల్సిన సూచనలపై కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు కసరత్తు చేశాయి. ఈ సమావేశానికి టీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, టీడీపీ నుంచి గల్లా జయదేవ్, వైసీపీ నుంచి మిథున్‌రెడ్డి హాజరవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com