Amit Shah : రాజ్యాంగంలోని ఆదర్శాలకు వెంకయ్య ఉదాహరణ..!

Amit Shah : రాజ్యాంగంలోని ఆదర్శాలకు వెంకయ్యనాయుడు చక్కటి ఉదాహరణ అన్నారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జయప్రకాష్‌నారాయణ్ స్ఫూర్తితో వెంకయ్య ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. కేంద్రమంత్రి నుంచి ఉప రాష్ట్రపతి వరకు అనేక పదవులకు ఆయన వన్నె తెచ్చారంటూ ప్రశంసించారు.
పార్లమెంటులో ఎన్నో ఉన్నత స్థాయి చర్చల్లో వెంకయ్య నాయుడు భాగస్వామిగా ఉన్నాడని చెప్పారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలను ప్రశంసించారు వెంకయ్య. హెల్త్,స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో విశేష సేవలందిస్తోందన్నారు. పద్మ పురస్కారాలు గతంలో లాగా సిఫార్సులతో ఇవ్వడం లేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక అత్యంత పారదర్శకతతో ఎంపిక చేస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com