India-Russia Annual Summit: పది కీలక ఒప్పందాలపై భారత్, రష్యా సంతకాలు..

India-Russia Annual Summit: పది కీలక ఒప్పందాలపై భారత్, రష్యా సంతకాలు..
India-Russia Annual Summit: భారత్, రష్యా ల మధ్య 21వ వార్షిక ద్వైపాక్షిక సదస్సు సోమవారం ఢిల్లీలో జరగనుంది.

India-Russia Annual Summit: భారత్, రష్యా ల మధ్య 21వ వార్షిక ద్వైపాక్షిక సదస్సు సోమవారం ఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం కాబోతున్నారు. ఈ భేటీ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత్ రాబోతున్నారు. ఇవాళ రాత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్, ఆ దేశ రక్షణ మంత్రి సెర్జి షోయ్‌గులు భారత్ చేరనున్నారు. ద్వైపాక్షిక సదస్సుతోపాటు ఉభయ దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశం కానున్నారు.

ఈ ద్వైపాక్షిక సదస్సులో ఇరు దేశాల మధ్య సుమారు 10 కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టబోతున్నట్టు సమాచారం. రక్షణ, పర్యావరణ మార్పులు, వాణిజ్యం సహా ఇతర రంగాలకు చెందిన 10 ఒప్పందాలపై సంతకాలు పెట్టనున్నారు. రష్యన్ ప్రెసిడెన్షియల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, ఇందులో కొన్ని పాక్షిక రహస్య విషయాలూ ఉన్నాయని, మరికొన్నింటిపై ఇంకా కసరత్తులు జరుగుతున్నాయని తెలిపారు. అందుకోసమే ఆ ఒప్పంద వివరాలను పూర్తిగా ఇప్పుడే బహిర్గతం చేయలేని చెప్పారు. ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత ధృడంగా మారుతాయని తెలిపారు. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పర్యటించే బృంద సభ్యుల సంఖ్యను తగ్గించినట్టు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story