రామ మందిర నిర్మాణ వ్యయం ప్రకటించిన జన్మభూమి ట్రస్ట్!

అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంచనా వ్యయాన్ని శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. ఆలయ నిర్మాణానికి మొత్తం 11 వందల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆలయ నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ప్రధాన ఆలయ నిర్మాణానికే రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా రూ.వంద కోట్లకు పైగా విరాళాలు సమకూరాయని, స్వదేశీ నిధులతోనే రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరీజీ మహరాజ్ తెలిపారు.
ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా రూ.వంద కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని వెల్లడించారు. దీంతో పాటు దాదాపు 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్తామని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఇందులో ఐఐటీ బాంబే, దిల్లీ, మద్రాస్, గుహవాటి, సీబీఆర్‌ఐ, రూర్కీతో పాటు ఎల్‌అండ్‌టీ, టాటా గ్రూప్‌నకు చెందిన ఇంజనీర్లు నిర్మాణ ప్రణాళికలను రూపొందించడంలో నిమగ్నమయ్యార శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొంది.
రామ మందిర నిర్మాణం మొదలైందని, బొంబే ఐఐటీలు, ఢిల్లీ, మద్రాస్, గౌహతి, ఎల్ అండ్ టీ, టాటా గ్రూప్స్‌కు చెందిన స్పెషల్ ఇంజనీర్లు కాంప్లెక్స్ ఫౌండేషన్ రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు.
Construction of Ram Temple complex in Ayodhya, including main structure, is estimated to cost around Rs 1,100 crore and is expected to be completed in three-and-a-half years: Swami Govind Dev Giriji Maharaj, treasurer, Shri Ram Janmbhoomi Teerth Kshetra Trust
— Press Trust of India (@PTI_News) December 28, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com