Buddhadeb Bhattacharjee : పద్మభూషన్ అవార్డును తిరస్కరించిన పశ్చిమబెంగాల్ మాజీ సీఎం

Buddhadeb Bhattacharjee : పద్మ భూషన్ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య. అవార్డు ప్రకటనపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఒకవేళ తనకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకుంటే తనకు ఆ అవార్డు అవసరం లేదన్నారు బుద్దదేవ్ భట్టాచార్య. కానీ కేంద్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. మంగళవారం ఉదయం బుద్దదేవ్ భట్టాచార్య భార్యతో మాట్లాడామని చెబుతోంది.
భట్టాచార్యకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వనున్నట్లు ఆమెతో చెప్పగా, ఆమోదించడంతోపాటు ధన్యవాదాలు చెప్పారని హోంశాఖ వర్గాలు తెలిపాయి. బుద్దదేవ్ భట్టాచార్యకు 77 ఏండ్లు. ఈయన నిత్యం ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. కొంతకాలంగా వయసు సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.
ఇక పద్మ అవార్డుల తిరస్కరణ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ అవార్డులను సంబంధిత వ్యక్తుల ఆమోదం పొందాకే ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com