car accident: రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో మరో ప్రమాదం.. ఒకరు మృతి

car accident: ఆ ప్రదేశానికి ఏమైంది.. అక్కడే మళ్లీ ఓ యాక్సిడెంట్ అయింది.. రిషబ్ చాలా అదృష్టవంతుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్‌లో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.హరిద్వార్ నుండి ఢిల్లీకి వెళుతున్న బ్రెజ్జా కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.. రూర్కీ, మంగ్లార్ కొత్వాలి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనగా మారాయి, దాదాపు ప్రతిరోజూ అక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల, క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు నర్సన్ సరిహద్దు సమీపంలో డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది, అయితే అతను అదృష్టవశాత్తూ ప్రమాదం నుండి బయటపడ్డాడు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తున్న ఎర్టిగా కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ఏడుగురు యువకులు పవిత్ర స్నానానికి హరిద్వార్‌కు వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు, వారు మంగ్లూర్ వద్దకు చేరుకోగానే, వారి కారు డివైడర్‌ను ఢీకొట్టింది, వాహనానికి తీవ్ర నష్టం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరు అప్పటికే మరణించారని డాక్టర్లు నిర్ధారించారు.
हरिद्वार जिले के नारसन बॉर्डर के पास हाईवे पर भयानक सड़क हादसा, एक कार डिवाइडर से टकराई..पिछले साल दिसंबर में नारसन बॉर्डर के पास ही मशहूर क्रिकेटर ऋषभ पंत की कार का हुआ था एक्सीडेंट #Accident #NarsanBorder #RishabhPant pic.twitter.com/ke1R8oqx51
— India TV Hindi (@IndiaTVHindi) April 3, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com