Ration: రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ఊరట..

Ration: రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ఊరట..
X
లాక్ డౌప్ కారణంగా తక్కువ సమయం మాత్రమే షాపులు తెరిచి ఉంచడంతో సరుకుల పంపిణీ సరిగా జరగడం లేదని కేంద్రం దృష్టికి వచ్చింది.

Ration: రెక్కాడితే కానీ డొక్కడని పేద, బడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ కొంత ఊరటనిస్తుంది. అసలే కరోనా సీజన్ ఆపై లాక్ డౌన్. చేసేందుకు పని దొరకదు. నాలుగు డబ్బులు లేనిదే ఇల్లు గడవదు. ఈ క్రమంలో రేషన్ కొంత ఆదుకుంటుంది. కోవిడ్ కారణంగా రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.

లాక్ డౌప్ కారణంగా తక్కువ సమయం మాత్రమే షాపులు తెరిచి ఉంచడంతో సరుకుల పంపిణీ సరిగా జరగడం లేదని కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో మోదీ సర్కార్ వెంటనే స్పందించి రేషన్ పంపిణీ విషయంలో రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సరుకులు తీసుకునే వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలిపింది.

ప్రతి రోజు కాస్త ఎక్కువ సమయం రేషన్ షాపులు తెరిచి ఉంచాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే నెలలో అన్ని రోజులు రేషన్ షాపులు తెరిచి ఉంచాలని తెలిపింది. నెలలో ఎప్పుడైనా సరుకులు తీసుకునే వెసులు బాటు వారికి ఉంటుందని పేర్కొంది.

కరోనా కష్టకాలంలో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ ప్రకటన చేసింది. కాగా మే, జూన్ నెలలో రేషన్ కార్డు కలిగిన వారికి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉచిత కోటా లభిస్తుంది.

Tags

Next Story