Tamilnadu: పదేళ్లుగా తల్లిని బంధించి.. బిస్కెట్లు విసిరేస్తూ.. కన్నకొడుకుల కాఠిన్యం

Tamilnadu: పదేళ్లుగా తల్లిని బంధించి.. బిస్కెట్లు విసిరేస్తూ.. కన్నకొడుకుల కాఠిన్యం
Tamilnadu: గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 72 ఏళ్ల జ్ఞానజ్యోతిని రక్షించారు.

Tamilnadu: కనిపెంచిన తల్లిదండ్రులు కన్నబిడ్డలకు బరువైపోతున్నారు. రేపొద్దున్న వారి జీవితం కూడా అలానే ఉంటుందన్న విషయం స్పురణకు రాకపోవడం అత్యంత విషాదం. తండ్రిలేడు.. ఉన్న ఒక్కగానొక్క తల్లిని చూసుకోవడానికి కూడా మనసు రావట్లేదు.

ఆమెను పదేళ్లుగా ఒక గదిలో బంధించి వారానికి ఒకసారి వచ్చి బిస్కెట్లు గేట్లో విసిరేసి వెళుతున్నారు. ఇరుగు పొరుగు వారు ఆమె పరిస్థితిని గమనించి వారే ఓ ముద్ద పెడుతూ ఆ తల్లి ఆకలి తీరుస్తున్నారు. ఈ అమానవీయ దృశ్యం తమిళనాడులోని తంజావూర్ లో చోటు చేసుకుంది. కావేరి నగర్ కు చెందిన జ్ఞానజ్యోతికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.. పిల్లలు ముగ్గుర్నీ చదివించారు.

పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్ చెన్నైలో ఇన్‌స్పెక్టర్‌. చిన్న కుమారుడు వెంకటేశన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్ల క్రితం కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. కొడుకులు ఇద్దరు ఆస్థి గొడల కారణంగా విడిగా ఉంటున్నారు. ఒక్కరూ తల్లిని పట్టించుకోవట్లేదు.

మంచి ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కొడుకులు తల్లిని పట్టించుకోకుండా వృద్ధాప్యంలో ఉన్న ఆమెను విడిచిపెట్టారని ఆరోపిస్తూ శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలో పనిచేస్తున్న 50 ఏళ్ల పోలీస్ ఇన్‌స్పెక్టర్ షణ్ముగసుందరం, పట్టుకోట్టైలో పనిచేస్తున్న దూరదర్శన్ ఉద్యోగి అతని తమ్ముడు వెంకటేశన్ (45) అనే ఇద్దరు కుమారులపై తమిళ యూనివర్సిటీ పోలీసులు సెక్షన్ 24 మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ కింద కేసు నమోదు చేశారు.

విలేఖరులతో మాట్లాడుతూ.. వెంకటేశన్ తన తల్లికి వచ్చే రూ.30 వేలు ప్రతినెలా తన తమ్ముడు వాడుకుంటున్నాడని, తల్లి అనారోగ్యానికి అతడే కారణమని షణ్ముగసుందరం తన తమ్ముడిని తప్పుబట్టాడు.

72 ఏళ్ల జ్ఞానజ్యోతి తన ఇంటిలో వివస్త్రగా పడి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో చూసిన గుర్తు తెలియని వ్యక్తి నుండి వచ్చిన సమాచారంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు

మానసిక స్థితి సరిగా లేని ఆమెను తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షణ్ముగసుందరన్, వెంకటేశన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story