Chhattisgarh: గూడ్స్ రైలును పల్టీకొట్టించి.. సర్పంచ్ భర్తను హత్య చేసి.. మావోయిస్టుల దారుణం..

Chhattisgarh (tv5news.in)
Chhattisgarh: ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణ్‌పూర్ జిల్లాలో పర్శాగావ్‌లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు. పర్శాగావ్ సర్పంచ్ భర్త బిర్జురాం అనే వ్యక్తిని హత్యచేశారు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించిన జేసీబీ, బైక్‌ను తగులబెట్టారు. మరోవైపు.. దంతేవాడ జిల్లాలో రైల్వే ట్రాక్‌ను తొలగించడంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
ఈ ట్రైన్ కిరండోల్ నుంచి విశాఖకు ఇనుప ఖనిజంతో వెళ్తోంది. ఎన్ కౌంటర్లకు నిరసనగా రైల్వే ట్రాక్ తొలగించినట్లు బైరాంగఢ్ ఏరియా కమిటీ పేరుతో రైలుకు బ్యానర్లు కట్టారు. ఈ చర్యతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.జగదల్‌పూర్-విశాఖ మార్గంలో యధావిధిగా రైళ్లు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com