నగర జీవికి ఊరట.. రోడ్లపై సిటీబస్సుల సందడి..

మహానగరాల్లో సిటీ బస్సులు లేకుండా ఎక్కడికి వెళ్లాలన్నా ఎంతో కష్టం.. కోవిడ్ కారణంగా ఆరు నెలల నుంచి సిటీ బస్సు అడ్రస్ లేదు.. ఎట్టకేలకు ఏపీ సిటీ ట్రాన్స్ పోర్ట్ అధికారులు ధైర్యం చేసి కోవిడ్ నిబంధనలకు లోబడి సిటీ బస్సులు రోడ్లపైకి తీసుకొస్తున్నారు. శనివారం ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నారు. మొత్తం ఆరు మార్గాల్లో ఉదయం నుంచి సాయింత్రం వరకు బస్సులను తిప్పనున్నారు. సీటుకి ఒక్కరిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం 26 వరకు తిప్పుతామని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తరువాతి పరిస్థితిని వివరించలేమని ఆర్ ఎం నాగేంద్రప్రసాద్ చెప్పారు.
ఒక్కో బస్సులో 60 శాతం మంది మాత్రమే ప్రయాణీకులు ఉంటారని అన్నారు. ప్రతి స్టాప్ వద్ద ఆర్టీసికి చెందిన ఉద్యోగి ఒకరు ఉంటారు. ప్రతి ప్రయాణీకుడు శానిటైజ్ చేసుకుని బస్సు ఎక్కాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. నిలబడి ప్రయాణం చేయరాదు. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన కోసం 100 బస్సులను మైలవరం, ఆగిరిపల్లి, విసన్నపేట, పామర్రు, విద్యాధరపురం, మంగళగిరి ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని మార్గాల్లో మరిన్ని బస్సులు నడిపే అవకాశం ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com