పార్లమెంట్ సమావేశాలను కుదించే ఆలోచనలో కేంద్రం

X
By - shanmukha |19 Sept 2020 8:25 PM IST
పార్లమెంట్ సమావేశాలను కుదించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఎంపీలు .
పార్లమెంట్ సమావేశాలను కుదించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఎంపీలు వరుసగా కరోనా బారినపడుతున్నారు. దీంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకూ సుమారు 30 మంది ఎంపీలకు కరోనా సోకింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో కేంద్ర పెద్దల్లో ఆందోళన కలిగిస్తుంది. దీంతో సమావేశాలను కుదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com