ఇవాళ భారత్‌ బంద్‌.. 40 లక్షల వాహనాలు నిలిపివేస్తామని సీఏఐటీ ప్రకటన

ఇవాళ భారత్‌ బంద్‌.. 40 లక్షల వాహనాలు నిలిపివేస్తామని సీఏఐటీ ప్రకటన
భారత్‌ బంద్‌లో 40వేల వాణిజ్య సంఘాలు పాల్గొంటున్నాయని తెలిపింది. దాదాపు 40 లక్షల వాహనాలు నిలిపివేస్తామని ప్రకటించారు.

విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలతోపాటు జీఎస్టీ, ఈ-వే బిల్స్‌కు వ్యతిరేకంగా వ్యాపార, కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. కేంద్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఇవాళ భారత్‌ బంద్‌ చేపడుతున్నాయి. దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య -సీఏఐటీ ప్రకటించింది...జీఎస్టీ బిల్లును సమీక్షించాలన్న డిమాండ్‌తో పాటు పెరుగుతున్న గ్యాస్‌, పెట్రోల్‌ ధరలకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది... దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండేలా చూడాలని డిమాండ్‌ చేసింది. ఈ బంద్‌కు అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా మద్దతు తెలిపింది. బంద్‌లో భాగంగా చక్కాజామ్‌కు పిలుపునిస్తున్నట్లు సీఏఐటీ స్పష్టం చేసింది. భారత్‌ బంద్‌లో 40వేల వాణిజ్య సంఘాలు పాల్గొంటున్నాయని తెలిపింది. దాదాపు 40 లక్షల వాహనాలు నిలిపివేస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1,500 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వ్యాపారుల సమాఖ్య స్పష్టం చేసింది...

కొత్త ఈ వే బిల్లులను రద్దు చేయాలని ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఇ-ఇన్వాయిస్‌కు ఫాస్ట్ ట్యాగ్ కనెక్టివిటీని ఉపయోగించడం ద్వారా ఇ-వే బిల్లును రద్దు చేసి వాహనాలను ట్రాక్ చేయాలని కోరుతోంది. అలాగే రవాణాకు ఎప్పుడైనా అనుమతి ఇవ్వాలని , రవాణాదారులకు జరిమానా రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.. అటు పెట్రోల్ , డీజిల్ ధరలను అదుపు చేయడంతోపాటు ధరలు దేశమంతా ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు... అటు జీఎస్టీ నిబంధనల విషయంలో వ్యాపార, కార్మిక సంఘాలు అభ్యంతరాల వ్యక్తం చేస్తున్నాయి. GST అమలును పర్యవేక్షించడానికి, పన్ను బేస్ విస్తరించడానికి ప్రతి జిల్లాలో "జిల్లా జిఎస్‌టి వర్కింగ్ గ్రూప్" ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.

జీఎస్టీ నిబంధనల్లో సవరణలు చేయాలంటూ గత ఆదివారం అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ-కామర్స్‌ సంస్థలపై నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు అందులో పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లులో సవరణలకు కేంద్రస్థాయి అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story