చైనాతో చర్చల సారాంశాన్ని ప్రజలముందు పెట్టాలి: కాంగ్రెస్

భారత్-చైనా సరిహద్దుల విషయంపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. సరిహద్దు వివాదాలపై ప్రభుత్వం చైనాతో చర్చలు జరపాలి అనుకుంటే.. దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ నూర్జేవాల్ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టిపెట్టాలని కోరారు. ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం రాజధర్మమని అన్నారు. చైనా ఇప్పటివరకూ ప్రభుత్వం చేసిన చర్చల సారాంశాన్ని దేశ పౌరుల ముందుంచాలని అన్నారు. చర్చలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని.. అయితే, ఈ చర్చల సారాంశం ప్రజల ముందు ఉంచాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాలని ముందుకు సాగినా... చైనా కయ్యానికి కాలు దువ్వడానికి కారణాలు ప్రభుత్వం చెప్పాలని సూర్జేవాల్ అన్నారు. చైనా రక్షణ మంత్రితో.. రాజ్‌నాథ్ సింగ్ సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపిన నేపథ్యం కాంగ్రెస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com