జాతీయం

కరోనా కాటుకి బలైన కాంగ్రెస్ ఎంపీ

కరోనా మహమ్మారి అన్ని వర్గాల వారిని భయాందోళనలకు గురిచేస్తుంది. ఇటీవల ఈ మహమ్మారి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది.

కరోనా కాటుకి బలైన కాంగ్రెస్ ఎంపీ
X

కరోనా మహమ్మారి అన్ని వర్గాల వారిని భయాందోళనలకు గురిచేస్తుంది. ఇటీవల ఈ మహమ్మారి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ప్రతీరోజు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిథులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా తమిళనాడులో కాంగ్రెస్ ఎంపీ కరోనా కాటుకి బలైయ్యారు. కన్యాకుమారి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ వసంతకుమార్ కరోనా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న తెలంగాణ గవర్నర్ తండ్రి కుమరి అనంతన్ అస్వస్థతకు గురైయ్యారు. వసంతకుమార్ స్వయానా గవర్నర్ తమిళిసై చిన్నాన్న. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story

RELATED STORIES