దేశంలో బుసలు కొడుతున్న కరోనా..పెరిగిన కేసులు.. అప్రమత్తమవ్వాల్సిందే..!

దేశంలో బుసలు కొడుతున్న కరోనా..పెరిగిన కేసులు.. అప్రమత్తమవ్వాల్సిందే..!
Corona Cases: దేశంలో కరోనా వైరస్ మళ్లీ పురివిప్పుతోంది. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగడం ఆందోళన కల్గిస్తోంది.

దేశంలో కరోనా వైరస్ మళ్లీ పురివిప్పుతోంది. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగడం ఆందోళన కల్గిస్తోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగడం కలవర పాటకు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో థర్డ్ వేవ్ విజృంభించడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. పాజిటివిటీ తగ్గిందనుకున్న సయమంలో ఒక్కసారిగా చాపకిందనీరులా కేసులు పెరుగడం ఆందోళన కల్గిస్తోంది. నిన్నమొన్నటివరకు 30

వేల కేసులునమోదుకాగా.. తాజాగా 42వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 562 మంది కోవిడ్ బారినపడి మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.17 శాతానికి చేరుకుందని తెలిపింది. దేశంలో మృతుల సంఖ్య 4లక్షల 25వేల 757 కేసులుగా నమోదయ్యాయి.

దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి భారీగా పెరిగాయి. ముందురోజు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా 40శాతం మేర పెరిగాయి. అంతకుముందు రోజు 30,549 కేసులు నమోదు కాగా.. తాజాగా 42 వేలకుపైగా ఒక్క రోజులోనే 36వేల 518 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేట్ 3.09 కోట్లకు చేరింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీలలో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ రోగులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోవడం వల్లే కేరళలో భారీస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ పరిస్థితుల్ని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిందని కేంద్ర బృందం ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి వెల్లడించింది.

కరోనా రెండోవేవ్‌ తగ్గుముఖం పడుతుందనుకునే సమయంలో కేరళలో కేసులు భారీగా నమోదువుతవుతున్నాయి. అక్కడ గత కొద్ది రోజులుగా 20 వేల మందికి పైగానే వైరస్ బారినపడుతున్నారు. దాంతో కేరళ పరిస్థితిని పర్యవేక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం అక్కడకు పంపింది. ఈ క్రమంలో కేరళ విధానాల్లోని లోపాలను బృంద సభ్యులు ఆరోగ్య శాఖకు నివేదించారు. కరోనా బాధితుల్లో 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆ బృందం పేర్కొంది. కేసులు పెరుగుతున్న విషయంపై తాను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో చర్చించినట్లు మీడియాకువిరవించారు.

Tags

Next Story