341 మంది పోలీసులకు కరోనా.. ఇద్దరు మృతి

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలవరం పెడుతోంది. రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 341 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 15,294కు చేరింది. ఇందులో 2,832 మంది పోలీసులు చికిత్స పొందుతున్నారు. మరో 12,306 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతులు 156కు పెరిగారని మహారాష్ట్ర పోలీసు శాఖ ప్రకటిచింది.
కాగా, మహారాష్ట్రలో ఇప్పటివరకు 7,80,689 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 24,399 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,93,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారి నుంచి 5,62,401 మంది కోలుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com