కలవర పెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్

కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు మన దేశంలోనూ కలవర పెడుతున్నాయి. ఇప్పటికే వీటి సంఖ్య 38కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరంతా బ్రిటన్ నుంచి వచ్చినవారేనని తెలిపింది. బెంగళూరులోని నిమ్హన్స్‌లో 10, హైదరాబాద్‌లోని CCMBలో 3, పుణెలోని NIVలో 5, ఢిల్లీలోని ICIBలో 11, NCDCలో 8, కోల్‌కతాలోని ఒక ల్యాబ్‌లో ఒక కేసు నిర్ధారణ అయినట్లు ఆ శాఖ వెల్లడించింది. బాధితులతోపాటు వచ్చిన ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులను గుర్తించి పరీక్షలు జరుపుతున్నారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి బ్రిటన్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య 33వేల మంది బ్రిటన్ నుంచి మన దేశానికి తిరిగొచ్చారు. వీరిందరినీ గుర్తించి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com