అరుణాచల్‌ప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్

X
కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి దాడి చేస్తూనే ఉంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాను కరోనా పరీక్ష ఆర్టీ పీసీఆర్ చేయించుకోగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని తెలిపారు. అయితే, తనకు కరోనా లక్షణాలేవి లేవని.. ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసొలేషన్‌లో ఉన్నానని ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసినవారంతా ఐసోలేషన్ లోకి వెళ్లాలని.. కరోనా పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరు వేలు దాటగా 11 మంది మరణించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
