కేంద్ర పర్యాటకశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

కేంద్ర పర్యాటకశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. వరుసగా కేంద్ర మంత్రులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుంది.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. వరుసగా కేంద్ర మంత్రులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. బుధవారం రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఈ మహమ్మారి సోకగా.. తాజాగా కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. బుధవారం కరోనా పరీక్ష చేసుకున్నానని.. ఫ‌లితం పాజిటివ్‌గా తేలిందని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. కరోనా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఇప్పటివరకూ ఏడుగురు కేంద్రమంత్రులు కరోనా బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు.

Tags

Next Story