కేరళ ఆరోగ్యమంత్రికి కరోనా పాజిటివ్

కేరళ ఆరోగ్యమంత్రికి కరోనా పాజిటివ్
X
కరోనా మహమ్మారి అన్ని వర్గాలవారిలో కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నారు.

కరోనా మహమ్మారి అన్ని వర్గాలవారిలో కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. కేరళ ఆర్థికమంత్రి డాక్టర్ థామస్ ఐస్సాక్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆదివారం సాయంత్రం ఆయన కరోనా పరీక్షలు చేపించుకోగా వైద్యులు కరోనా సోకిందని నిర్థారించారు. దీంతో ఇటీవల ఆయనకు కలిసినవారు క్వారంటైన్‌కు వెళ్లాలని మంత్రి కోరారు. సోమవారం ఆయన ఆఫీస్‌ను శానిటైజ్ చేయనున్నారు. కేరళలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదవుతున్నారు. ఒకానొక దశలో కేరళ కరోనాను కట్టడి చేసినా.. మళ్లీ అక్కడ ఈ మహమ్మారి విజృంభించింది. ఇప్పటివరకూ కేరళలో 87,841 కరోనా కేసులు నమోదవ్వగా.. కరోనా కాటుకు 347 మంది మరణించారు.

Tags

Next Story