301 జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు

301 జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు
ప్రస్తుతం దేశంలోని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలోని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 741 జిల్లాలకు గానూ 301 జిల్లాల్లో 20 శాతం అంతకుమించి పాజిటివిటీ నమోదవుతున్నట్లు తెలిపింది. వాటిలో 15 జిల్లాల్లో అయితే ఏకంగా 50 శాతానికిపైగానే పాజిటివిటీ రేటు ఉందని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లోని చంగ్లాంగ్ జిల్లాలో అత్యధికంగా 91.5 శాతం పాజిటివిటీ రేటు ఉందని వివరించింది. ఆ 15 జిల్లాల్లో హ‌ర్యానా జిల్లాలు నాలుగు, అరుణాచల్‌ప్రదేశ్ జిల్లాలు రెండు, రాజస్థాన్ జిల్లాలు రెండు కాగా.. మ‌రో ఏడు జిల్లాలు ఏడు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నాయి. అటు కరోనా మహమ్మారి కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు మాత్రం తగ్గడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story