Corona Update: రికార్డు స్థాయిలో మరణాలు.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు

Corona Update: రికార్డు స్థాయిలో మరణాలు.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు
మొత్తం కేసుల సంఖ్య 2,54,96,330 కు చేరుకున్నట్లు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.

Corona Update: ఒకే రోజులో కరోనావైరస్ కారణంగా భారతదేశంలో రికార్డు స్థాయిలో 4,529 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో మరణాల సంఖ్య 2,83,248 కు చేరుకోగా, 2,67,334 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,54,96,330 కు చేరుకున్నట్లు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.

మొత్తం ఇన్ఫెక్షన్లలో 12.66 శాతంతో కూడిన క్రియాశీల కేసులు 32,26,719 కు తగ్గాయి, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 86.23 శాతానికి మెరుగుపడింది.

ఈ వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 2,19,86,363 కు పెరిగింది, కేసు మరణాల రేటు 1.11 శాతానికి పెరిగిందని డేటా పేర్కొంది.

భారతదేశంలోని కోవిడ్ -19 సంఖ్య గత ఏడాది ఆగస్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు, సెప్టెంబర్ 16 న 50 లక్షలు దాటింది, సెప్టెంబర్ 28 న 60 లక్షలు దాటింది. అక్టోబర్ 11 న 70 లక్షలు దాటింది.

అక్టోబర్ 29 న 80 లక్షలు, నవంబర్ 20 న 90 లక్షలు, డిసెంబర్ 19 న ఒక కోటి మార్కును అధిగమించింది. ఈ ఏడాది మే 4 న దేశంలో 2 కోట్ల మంది కారోనా బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక ముంబై విషయానికి వస్తే రోజువారీ కరోనా వైరస్ కేసుల సంఖ్య 10 వారాల తరువాత కాస్త తగ్గుముఖం పట్టి 1,000కి చేరుకుంది. ఏప్రిల్‌లో ప్రమాదకరమైన సెకండ్ వేవ్ కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వణికిపోయిన మహారాష్ట్ర రాజధాని ముంబై మంగళవారం కేవలం 953 కేసులను నమోదు చేసింది. అయితే, ఏప్రిల్ స్థాయిలతో పోలిస్తే పరీక్ష చేయించుకునే వారి సంఖ్య బాగా తగ్గింది.

నగరంలో మంగళవారం ఒక్క రోజులో 44 మరణాలు సంభవించాయి. ముంబైలో పాజిటివిటీ రేటు 5.31 శాతం. రికవరీ రేటు కూడా 93 శాతానికి మెరుగుపడింది.

Tags

Read MoreRead Less
Next Story