తెలంగాణలో కొత్తగా 1,802మందికి కరోనా

తెలంగాణలో కొత్తగా 1,802మందికి కరోనా
తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,802 మందికి కరోనా పాజిటివ్ అని

తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,802 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1,42,771కు చేరింది. అటు, కొత్తగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ 895 మంది కరోనా కాటుకి బలైయ్యారు. ఇప్పటి వరకు 1,10,241 మంది కోలుకోగా.. ఇంకా, 31,635 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు దేశ మరణాల రేటు కంటే తక్కువగా ఉండటం కాస్తా ఊరట కల్పిస్తుంది.

Tags

Next Story