తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా కేసులు

X
తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,392 నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1,45,163కు చేరింది. ఈ రోజు 11 కరోనా మృతులు నమోదవ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 906మంది కరోనా కాటుకి బలైయ్యారు. ఇప్పటివరకూ 1,12,587 మంది డిశ్చార్జి అవ్వగా.. ఇంకా 31,670 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం నమోదవుతుంది. అయితే, దేశంలో మరణాల రేటు కంటే తెలంగాణలో తక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
