భారత్‌లో నిలిచిపోయిన క్లినికల్ ట్రయల్స్

భారత్‌లో నిలిచిపోయిన క్లినికల్ ట్రయల్స్
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపడుతున్న కరోనా టీకా ట్రయల్స్ ను నిలిపివేసింది. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపడుతున్న కరోనా టీకా ట్రయల్స్ ను నిలిపివేసింది. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ట్రయల్స్ నిలిపివేసినట్టు తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అభివృద్ది చేసిన ఆస్టాజెనెకా వ్యాక్సిన్‌పై పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశంలోని రెండు, మూడు దశల ట్రైయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం మొదటిదశ ట్రయల్స్‌కు సంబంధించిన డేటా కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి సేకరించింది. అయితే, ఈ టీకాపై బ్రిటన్‌లో జరిపిన చివరి దశ ట్రయల్స్‌లో ఓ వ్యక్తికి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని.. దీంతో క్లినికల్ ట్రయల్స్ ఆపేశామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇటీవల తెలిపింది. దీంతో భారత్‌‌లో కూడా ఈ వ్యాక్సిన్ పై ట్రయల్స్ నిలిపివేశారు. ఇప్పటివరకూ జరిగిన క్లినికల్ ట్రయల్స్‌ గురించి వివరణ ఇవ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీసీజీఐ కోరింది.

Tags

Read MoreRead Less
Next Story