కరోనా వ్యాక్సినేషన్‌పై దేశవ్యాప్తంగా డ్రైరన్

కరోనా వ్యాక్సిన్‌కు అనుమతి రాగానే.. వ్యాక్సినేషన్ ఎలా వేయాలన్న దానిపై దేశవ్యాప్తంగా డ్రైరన్ నడుస్తోంది. డ్రైరన్ నడుస్తున్న రాష్ట్రాల్లోని ప్రతి కేంద్రంలో 25 మంది ఆరోగ్య కార్యకర్తలకు డమ్మీ వ్యాక్సిన్ వేస్తారు. ఇందులో పాల్గొనే వారి పేర్లు నిన్నే కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. హైదరాబాద్‌లో తిలక్‌నగర్ యూపీహెచ్‌సీ, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, సోమాజిగూడ యశోద ఆసుపత్రితోపాటు మహబూబ్‌నగర్ జిల్లా జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నేహా షైన్ ప్రైవేట్ ఆసుపత్రిలో డ్రైరన్ చేపడుతున్నారు.
డ్రైరన్‌లో భాగంగా ఈ ఉదయం ఎనిమిది గంటలకే డమ్మీ వ్యాక్సిన్‌ను స్టోరేజ్ కేంద్రాల నుంచి తరలించారు. ఒక్కో కేంద్రానికీ అవసరమైన వాటి కంటే మరో 15 శాతం ఎక్కువ డోసులు పంపించారు. డ్రైరన్ కేంద్రాలకు వ్యాక్సిన్లు చేరగానే అవి సరిగా ఉన్నాయో లేదో చెక్ చేశారు డాక్టర్లు. డ్రైరన్ సెంటర్స్‌లో ఉంచిన ఫ్రీజర్లలో వాటిని భద్రపరిచారు. వ్యాక్సిన్ వేసే 5 నిమిషాల ముందు మాత్రమే వాటిని బయటకు తీసేలా శిక్షణ ఇస్తున్నారు.
వ్యాక్సిన్ ఎవరికి, ఏ టైంలో వేస్తున్నదీ వారి వారి మొబైల్స్‌కి మెసేజ్ వెళ్తుంది. ఆ సమయాన్ని బట్టి వారు కేంద్రంలో రెడీగా ఉండాలి. అక్కడి పోలీసులకు తమ ఐడీ కార్డు చూపించాలి. లేదా తమకు వచ్చిన మెసేజ్ చూపించాలి. వారిని పోలీసులు చెక్ చేసి.. కేంద్రం లోపలికి అనుమతిస్తారు. ఇలా ఒకరి తరువాత ఒకరికి వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు.. పక్క గదిలో ఓ అరగంటపాటు ఉండాలి. ఆ సమయంలో వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే.. ఆస్పత్రికి తరలిస్తారు. రాకపోతే ఇంటికి పంపిస్తారు. ఇవాళ్టి డ్రై రన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవే రావు. కానీ.. ఒరిజినల్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారో, అలాగే ఇవాళా ట్రయల్ రన్ చేస్తారు. డ్రై రన్‌లో పాల్గొన్న వారికి రెండో డోస్ ఎప్పుడు ఇచ్చేదీ మొబైల్ మెసేజ్ పంపిస్తారు.
డ్రైరన్‌లో భాగంగా ప్రతి సెంటర్‌లో 25 మంది ఆరోగ్య కార్యకర్తలకు డమ్మీ టీకా వేస్తారు. వారి డేటాను కోవిన్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇలా అప్‌లోడ్ చేసే క్రమంలో.. స్థలం, ఇతర ఏర్పాట్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, విద్యుత్, భద్రత తదితర అంశాలను పరిశీలిస్తారు. మూడు గదులున్న కేంద్రంలో టీకాలు వేస్తారు. టీకా కోసం వచ్చే వారు, వెళ్లే వారి కోసం ప్రత్యేక ద్వారాలు ఉండేట్టుగా చూస్తారు. డ్రైరన్ టీకా సరఫరా, నిల్వ, కోల్డ్ చైన్ మేనేజ్‌మెంట్ సహా అన్నింటినీ పరిశీలిస్తారు.
మొదటి వ్యాక్సినేటర్ ఆఫీసర్.. తన వద్ద జాబితాలో వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తి పేరు ఉందో లేదో నిర్దారించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత రెండో వ్యాక్సినేటర్ ఆఫీసర్ కోవిన్ యాప్‌లో ఆ వ్యక్తి పేరును సరిచూస్తారు. వ్యాక్సిన్ లేకుండానే అతడికి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా సిబ్బంది ట్రయల్ వేస్తారు. ఆ తరువాత వ్యాక్సినేషన్ చేసిన విషయాన్ని రెండో వ్యాక్సినేటర్‌కు తెలియజేస్తారు. ఆ విషయాన్ని కోవిన్ యాప్‌లో రిపోర్ట్ చేస్తారు. మూడు, నాలుగో వ్యాక్సినేటర్ ఆఫీసర్లు వ్యాక్సిన్ కోసం వచ్చేవారిని క్యూలో ఉండేలా చూస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు అరగంట పాటు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ వారికి ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే రెండో వ్యాక్సినేటర్ ఆఫీసర్ కోవిన్ యాప్ సైట్ ద్వారా రిపోర్ట్ చేస్తారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే 104 లేదా 1075కు ఫోన్ చేస్తారు.
కేంద్ర ఆరోగ్య నిపుణుల కమిటీ... కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఓకే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అనుమతి వచ్చిన వెంటనే తెలంగాణకు తొలి విడతగా.. 10 లక్షల డోసులు వస్తాయని అంచనా వేస్తున్నారు. వాటిని రాష్ట్రంలోని 2 లక్షల 67వేల 246 మంది ఆరోగ్య సిబ్బందికి, 2 లక్షల మందికి పైగా ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇస్తారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com