రెండో విడత వ్యాక్సిన్ డ్రై రన్‌ విజయవంతం

రెండో విడత వ్యాక్సిన్  డ్రై రన్‌ విజయవంతం
కేంద్రం మార్గదర్శకాలతో ఇప్పటికే డ్రై రన్‌ పూర్తి చేసిన పలు రాష్ట్రాలు తదుపరి కార్యాచరణపై ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి సిద్ధమైంది. పూర్తి దేశీయంగా రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతించిన కేంద్రం.. రాష్ట్రాలకు వీటి సరఫరాపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే దేశంలో కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని 37 స్టోరేజ్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రం పూర్తి చేసింది. పుణె వేదికగా టీకా పంపిణీ కార్యక్రమం జరగనుంది.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ నేపథ్యంలో ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీకానున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నట్లు సమాచారం. తొలి దశలో 30 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. కొవిడ్‌ టీకాల పంపిణీకి అవసరమైన పరికరాలు, రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం 480 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులను రాష్ట్రాల వారీగా పంపిణీ చేస్తుందని తెలిసింది.

ఇక టీకా నిల్వ, రవాణా, వ్యాక్సినేషన్‌కు అవసరమైన మౌలిక సామగ్రిని అందిస్తోంది. కేంద్రం మార్గదర్శకాలతో ఇప్పటికే డ్రై రన్‌ పూర్తి చేసిన పలు రాష్ట్రాలు తదుపరి కార్యాచరణపై ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రజలకు టీకా ఇవ్వడానికి విధివిధానాలు రూపొందిస్తోంది. వ్యాక్సిన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారు సమాచారం కోసం 104 టోల్‌ఫ్రీ నెంబరుకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో.. కొవిడ్‌ టీకా తీసుకోవడానికి ఎలాంటి ప్రక్రియలు అనుసరించాలన్న దానిపై వైద్యారోగ్య శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story