ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా కొత్త రకం వైరస్

ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా కొత్త రకం వైరస్
కరోనా స్ట్రెయిన్‌ మనుషుల నుంచి మనుషులకు తొందరగా వ్యాప్తి చెందుతుందని సీసీఎంబీ ప్రొఫెసర్‌ అన్నారు.

కరోనా కొత్త రకం వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. యూకే నుంచి తెలుగు రాష్ట్రాలకు అనేకమంది రావడంతో వారిని ట్రేస్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరోనా స్ట్రెయిన్‌ మనుషుల నుంచి మనుషులకు తొందరగా వ్యాప్తి చెందుతుందని సీసీఎంబీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధు అన్నారు. కరోనా వైరస్‌ మానవ శరీరంలోకి చేరిన తర్వాత మార్పులకు గురవుతుందన్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులో కొత్త వైరస్‌ కనిపించదన్నారు.

బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మేడ్జల్ జిల్లాకు చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో ఇప్పటివరకు యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన కరోనా బాధితుల సంఖ్య 18కి పెరిగింది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన మరో 184 మంది ప్రయాణికుల సమాచారం తెలియాల్సి ఉందని తెలిపింది. ఇప్పటివరకు యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాల వారున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈమేరకు ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించింది.

అటు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురికి కరోనా పాజివిట్ నిర్థారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. యూకే నుంచి 1214 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తించామని తెలిపింది. వారిలో 1158 మందిని గుర్తించామని.. మరో 56 మంది వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. గుర్తించిన వారిలో1101 మందిని క్వారంటైన్ లో ఉంచినట్లు చెప్పింది.

Tags

Next Story