Covid 19 : పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఒకే రోజు 3వేల 25మందికి పాజిటీవ్

భారతదేశంలో గురువారం 3వేల 95 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది 2023లో అత్యధింకగా ఒకే రోజులో పెరిగిన సంఖ్య. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15వేల 208 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. H3N2 ఇన్‌ఫ్లుఎంజా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో దేశంలో గత కొన్ని రోజులుగా, కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం నాడు 2,151 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా, రికవరీ రేటు ప్రస్తుతం 98.78 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 1,390 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు రికవరీల సంఖ్య 4,41,69,711కి (4 కోట్లకు పైగా) చేరాయి.
గోవా, గుజరాత్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు రోగులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. ఢిల్లీలో గురువారం 295 తాజా కోవిడ్ కేసులు 12.48 శాతం పాజిటివ్ రేటుతో నమోదయ్యాయి. దేశ రాజధానిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com