Corona: గాలిలో కరోనా.. తగ్గుతున్న సంక్రమణ
Corona: తక్కువ ఉష్ణోగ్రతలు, వాతావరణం తేమగా ఉన్నప్పుడు వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
BY Prasanna14 Jan 2022 9:10 AM GMT

X
Prasanna14 Jan 2022 9:10 AM GMT
Corona: వాతావరణం వేడిగా లేదా పొడిగా ఉన్నప్పుడు వైరస్‌లు తమ ఉనికిని కోల్పోతాయి.. ఎక్కువసేపు మనుగడ సాగించలేవు అని నిపుణులు మరోసారి ధృవీకరించారు. కరోనా కూడా ఇందుకు మినహాయింపు కాదని అన్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు, వాతావరణం తేమగా ఉన్నప్పుడు వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ గాలిలో ఉంటే దాని సంక్రమణ సామర్థ్యం కేవలం 20 నిమిషాల్లో 90శాతం మేర నశిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
దాదాపు 50 శాతం సంక్రమణ సామర్థ్యాన్ని మొదటి 5-10 సెకన్ల వ్యవధిలోనే కోల్పోతున్నాయని నిపుణులు నిర్ధారించారు. ఇప్పటి వరకు, గాలిలో ఉండే చిన్న బిందువులలో వైరస్ ఎంతకాలం జీవించి ఉంటుందనే దానిపై అధ్యయనాలు జరిగాయి.
Next Story