Pragya Thakur: గోమూత్రం కరోనా కట్టడికి దివ్యౌషధం: బీజేపీ ఎంపి సూచన

Pragya Thakur: ఈ వ్యాక్సిన్లు, ఈ ఆక్సిజన్ల హడివిడి ఇదంతా ఎందుకు.. ప్రతి రోజూ ఓ గ్లాస్ గోమూత్రం తాగితే కరోనా రమ్మనా రాదని అంటున్నారు మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన బిజెపి ఎంపి ప్రగ్యా ఠాకూర్. తాను ప్రతిరోజూ ఆవు మూత్రం తాగుతున్నానని, ప్రాణాంతకమైన కరోనావైరస్ వ్యాధి బారిన పడకుండా అదే తనను రక్షిస్తోందని వెల్లడించడంతో మరోసారి తెరపైకి వచ్చారు ప్రగ్యా.
పార్టీ సమావేశంలో ప్రసంగించిన ఠాకూర్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో ప్రతిరోజూ దేశీ ఆవు (స్వదేశీ ఆవు మూత్రం) తీసుకోవాలని ప్రజలకు సూచించారు. గో మూత్రం తీసుకోవడం వలనే కోవిడ్ తన దరి చేరదని అన్నారు.
గత ఏడాది డిసెంబర్ లో కరోనా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందారు. ఆధారాలు, రుజువులు లేని ప్రక్రియలతో కోవిడ్ బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తుంటారు.
గోమూత్రం రోజువారీ తీసుకోవడం గురించి ఠాకూర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి వాదనలు చేసినందుకు నెటిజన్లు ఆమెను తప్పుపడుతున్నారు.
దేశ ప్రజలు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా బారిన పడి ప్రతి రోజూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువవుతుంటే ఎంపీ స్థాయిలో ఉన్న ఒక ఎంపి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని పోస్టులు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com