Crime: అది యాక్సిడెంట్ కాదు.. హత్యే.. ! సినిమా రేంజ్ లో స్కెచ్....

గతేడాది రోడ్దు ప్రమాదంలో మరణించిన 37ఏళ్ల వ్యక్తిది హత్యేనని తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. ఏపీ గుంటూరుకు చెందిన భిక్షపతి 2021 డిసెంబర్‌లో ఫరూఖ్‌నగర్ మండలంలో ఎస్‌యూవీ ఢీకొని మృతి చెందాడు. అయితే అది ప్రమాదం కాదని ఇన్సూరెన్స్ డబ్బు రూ. 50 లక్షల కోసం సినీ ఫక్కీలో హత్యచేశారని తెలిపారు. ఈ కేసులో పోలీసులు భిక్షపతి మాజీ సహోద్యోగులైన శ్రీకాంత్, సతీష్, సమ్మన్నలతో పాటు మోతీలాల్ అనే కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.
షాద్‌నగర్ పోలీసులు కథనం మేరకు.. శ్రీకాంత్ మోసపూరిత కంపెనీని నడుపుతున్నాడు. అతని వద్ద పని చేస్తున్నవారి క్రెడిట్‌కార్డులు, ఆధార్ కార్డులు పెట్టి రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వాడు. భిక్షపతి అక్టోబర్ 2020లో కంపెనీలో చేరాడు. అతడు చేరిన కొద్ది రోజుల తర్వాత శ్రీకాంత్ బిక్షపతి పేరు మీద రూ. 50 లక్షల బీమా పథకాన్ని తీసుకున్నాడు. దానికి నామినీగా తన పేరే పెట్టుకున్నాడు. ఇదే విధంగా ఫిబ్రవరి 2021లో శ్రీకాంత్ తన డాక్యుమెంట్లను ఉపయోగించి భిక్షపతి పేరు మీద రుణం తీసుకొని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒక ఇల్లు కూడా కొన్నాడు. ఈ సమయంలో భిక్షపతికి దగ్గరి బంధువులెవరూ లేరని శ్రీకాంత్ తెలుసుకున్నాడు.
ఈ నేపథ్యంలో బిక్షపతిని చంపి రూ.50 లక్షల బీమా వసూలు చేయాలని ఈ నలుగురు నిందితులు పథకం వేశారు. అనుకున్న ప్రకారమే అతన్ని కారుతో గుద్ది హత్యచేశారు. భిక్షపతికి ఉన్న రూ. 50 లక్షల జీవిత బీమా పాలసీని, అతడి పేర ఉన్న ఇంటి బీమాకు నామినీగా శ్రీకాంత్ వాటిని దాన్ని క్లైమ్ చేసుకునేందు ప్రయత్నిస్తున్నట్లు బీమా కంపెనీలు పోలీసులకు తెలియజేశాయి. దీంతో ప్రమాదం జరిగిన సమయంలో బిక్షపతి కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా అదే సమయంలో శ్రీకాంత్ సిగ్నల్స్ కూడా అక్కడే ఉన్నట్లు గుర్తించారు.
నిందితులు బిక్షపతికి మద్యంతాగించి బోడుప్పల్ నుంచి మెగిలి గడ్డకు కారులో వెళ్లేలా చేశారు. మార్గం మధ్యలో బిక్షపతి మూత్ర విసర్జనకు కారు దిగగా అతని తలపై హాకీ స్టిక్ తో బలంగా మోదారు. అనంతరం యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. బిక్షపతి పాన్ కార్డును గుర్తింపుకోసం అక్కడే వదిలి వెళ్లారు.
అనంతరం బీమాను క్లైమ్ చేసుకొని నిందితులైన శ్రీకాంత్ 30 లక్షలు, మోతీలాల్ 20లక్షలు, మిగతా ఇద్దరు చెరో 5 లక్షలు పంచుకున్నారు. ఈ కోణంలో విచారణ చేయగా అసలు గుట్టు బయట పడిందని శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com