బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ నెల 24న తుఫానుగా మారే అవకాశం..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 24వ తేదీ కల్లా తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సహా తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీవ్... ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పచ్చిమ బెంగాల్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల ప్రధాన కార్యదర్శిలకి లేఖ రాశారు.
ఈనెల 26న ఒడిస్సా , పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఒడిస్సా , పశ్చిమ బెంగాల్ లలో తుఫాను తలెత్తడంతో పాటు తూర్పు కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల తలెత్తే ప్రమాదం ఉన్నట్లు అప్రమత్తం చేశారు. ఇప్పటికే కొవిడ్ తో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ప్రజారోగ్యంపై ఇప్పుడు నీళ్ళు, దోమలు, గాలి ద్వారా సంక్రమించే రోగాలు మరిన్ని సవాళ్లు విసిరేలా ఉన్నాయని హెచ్చరించారు.
అందువల్ల అత్యవసర మందులను నిలువ చేసుకోవాలని, వైద్యసేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com