దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా..

దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా..
రెండ్రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధిష్టానం ఆమె పేరును ప్రకటించారు.

బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధిష్టానం ఆమె పేరును ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ఆ తరువాత ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దగ్గు, జలుబు లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టు పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

గత రెండు, మూడు రోజుల నుంచి ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, కుటుంబసభ్యులు ప్రస్తుతం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బీజేపీ సీనియర్లు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో నేత ఉమా భారతికి కూడా కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో కొత్తగా నిన్న ఒక్కరోజే 80,472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 62,25,764కి చేరింది.


Tags

Next Story