Delhi : బాణాసంచాపై నిషేధం ఉన్నప్పటికి పట్టించుకోని జనం.. దిగజారిన గాలి నాణ్యత..!

Delhi : బాణాసంచాపై నిషేధం ఉన్నప్పటికి పట్టించుకోని జనం.. దిగజారిన గాలి నాణ్యత..!
Delhi : దీపావళి కారణంగా ఢిల్లీ జన్ ఫథ్ ఏరియాలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థితిలో కి వెళ్లినట్లు పోల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. దీపావళి కారణంగా ఢిల్లీ జన్ ఫథ్ ఏరియాలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థితిలో కి వెళ్లినట్లు పోల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. తెల్లవారుజామున ఢిల్లీపై దట్టమైన పొగకమ్ముకుంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు కళ్ల మంటలు, బొంగురు గొంతుతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్స్‌కు క్యూ కట్టారు. ఉదయం 8 దాటినా హైవేపై విజిబిలిటీ చాలా తక్కువగానే ఉంది. 20 మీటర్ల ముందున్న వాహనం కూడా స్పష్టంగా కనిపించనంతగా ఈ పొగమమంచు కమ్మేసింది.

దీపావళి సందర్భంగా ఢిల్లీలో బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉన్నా.....పలు చోట్ల ప్రజలు నిబంధనలు పట్టించుకోలేదు. దీనికి తోడూ ఢిల్లీ సరిహద్దుల్లో ని పంట పోలాల్లో రైతులు వరి గడ్డి తగలబెట్టడంతో గాలి నాణ్యత దిగజారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మెరుగయ్యే అవకాశాలు లేవని తెలిపింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సఫర్ సంస్థ. బాణాసంచా గతేడాదితో పోల్చితే సగం కాల్చినా.. ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థితిలోకి వెళ్తుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story