ఇండియాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!

ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా పాజిటివ్‌ల సంఖ్య తగ్గింది. సంఖ్య తగ్గినప్పటికీ.. రోజుకు 50వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53వేల 480 కేసులు నమోదయ్యాయి. మొన్న ఆదివారం 58వేలకుపైగా పాజిటివ్ కేసులు వస్తే.. సోమవారం నాడు 56వేల కేసులు వచ్చాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ 21 లక్షల 49వేల 335కి చేరింది. కరోనా కారణంగా నిన్న 354 మంది చనిపోయారు. కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాలు మాత్రం 104 రోజుల్లో నిన్ననే అత్యధికంగా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 62 వేల 468 మంది చనిపోయారు. మరోవైపు రికవరీ రేటు కూడా తగ్గుతోంది. ప్రస్తుతానికి రికవరీ రేటు 94.1 శాతానికి తగ్గింది.
మరోవైపు మహారాష్ట్రలో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. నిన్న మహారాష్ట్రలో 27వేల కేసులు నమోదవగా, 139 మంది చనిపోయారు. గత ఏడు రోజులతో పోల్చితే మహారాష్ట్రలో నిన్ననే కరోనా కేసులు తగ్గాయి. ఛత్తీస్‌గఢ్‌లో 3వేలు, కర్నాటకలో 3వేల కేసులు రికార్డ్ అయ్యాయి. దేశంలోని 8 రాష్ట్రాల్లో నిన్న 2వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. మొత్తానికి గత ఆరు రోజుల్లో నిన్ననే తక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com