Delhi: టర్కీకి భారత్ సహాయం

పొరుగుదేశం కష్టంలో ఉంటే త్వరితగతిన స్పందించే మిత్రదేశంగా భారత్ ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది. తాజాగా టర్కీలో నెలకొన్న భయానక పరిస్థితుల్లో అక్కడి వారికి చేతనైన సహాయం చేసేందుకు హుటాహుటిన సహాయాన్ని తరలిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశం మేరకు వంద మందితో కూడిన రెండు NDRF బృందాలు, ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ లు, అత్యవసర పరికరాలు సహా ప్రత్యేక విమానం టర్కీ బయలుదేరబోతోంది. ఈ మేరకు మోది ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా మిడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ధృవీకరించారు. అత్యవసర చికిత్సలో తర్ఫీదు పొందిన వైద్యులు, ప్యారా మెడిక్స్, అవరమైన మందులతో కూడిన వైద్య బృందాలు కూడా టర్కీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. టర్కీ ప్రభుత్వంతో జరుగుతున్న సమాలోచనలు కొలిక్కి రాగానే బృందాలు ఇక్కడి నుంచి పయనమవుతాయని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com