Delhi Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు..

Delhi fire accident (tv5news.in)
Delhi Fire Accident: చిన్న నిప్పురవ్వ తాకితేనే తట్టుకోలేకపోతాం. అలాంటిది ఒక్కసారిగా ఒళ్లంతా మంటలు అంటుకుంటే.. తలచుకుంటేనే భయమేస్తుంది. మనం రోజుకు ఎన్నో ఫైర్ యాక్సిడెంట్లను చూస్తున్నాం. కానీ అలాంటి ఓ ఫైర్ యాక్సిడెంట్ ఒక కుటుంబంలోని నలుగురిని ఒకేసారి కడతేర్చింది. ఘడ నిద్రలో ఉన్న వారందరూ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలోని సీమపూరి కాలనీలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల బిల్డింగ్‌లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మూడో ఫ్లోర్‌లో ఉంటున్న కుటుంబమంతా పొగ కమ్ముకుని ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. మంటను చూసిన కాసేపటికే ఫైర్ సిబ్బందికి సమాచారం అందినా వారు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
58 ఏళ్ల హరిలాల్, తన భార్య రీనా, కూతురు రోహిని, కుమారులు అషు, అక్షయ్‌లతో కలిసి సీమపూరి కాలనీలో నివాసముంటున్నారు. హరిలాల్.. శాస్త్రి భవన్‌లో క్లాస్ 4 ఉద్యోగి, తన భార్య రీనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తుండేది. అక్షయ్ లేబర్ వర్క్ చేస్తుండగా.. అషు ఉద్యోగాల వేటలో ఉన్నాడు. కుమార్తె గవర్నమెంట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది.
కొడుకు అక్షయ్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ బిల్డింగ్‌లోని మూడో ఫ్లోర్‌లో పడుకున్నారు. అక్షయ్ మాత్రం రెండో ఫ్లోర్‌లో పడుకున్నాడు. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకుని మూడో ఫ్లార్ అంతా బూడిద అయిపోయింది. రెండో ఫ్లోర్‌లో పడుకున్న అక్షయ్ మాత్రమే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలాడు. దోమల కాయిల్ వల్ల దట్టమైన పొగ వచ్చిందని, దానివల్లే అందరూ ఊపిరి ఆడక చనిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com